గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి

గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు మంత్రి లక్ష్మారెడ్డి. మహబూబ్‌నగర్‌ జిల్లా నర్వ మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు.  ఉందెకోడ్‌ గ్రామంలో ప్రాథమిక ఆసుపత్రి భవనంతో పాటు స్త్రీ శక్తి భవనం, నూతన పశు వైద్యశాల భవనాలను ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత కల్యాల గ్రామంలో వాటర్‌ ప్యూరిఫైయర్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు. పెద్దకడుమూరులో జరుగుతున్న పలు అభివృద్ధి  కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌, వార్డు సభ్యులు, ఎంపీటీసీతో పాటు ఇతర పార్టీలకు చెందిన 150 మంది మంత్రి లక్ష్మారెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌ లో చేరారు.