గోరక్షకుల అరాచకం

గోరక్షకుల పేరుతో కాషాయ ముఠాలు అరాచకం సృష్టిస్తున్నాయి. బీఫ్ అమ్మకందారులపై విచక్షణా రహితంగా దాడులు చేస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని మాలెగాంవ్ ప్రాంతంలో ఉన్న వశీంలో ఈ ముఠా చెలరేగింది. బీఫ్ అమ్ముతున్న ముగ్గురిపై నలుగురు యువకులు దాడి చేశారు. చెప్పనలవి కాని బూతులు తిడుతూ ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఆ తర్వాత వారిని పోలీస్ స్టేషన్ లో అప్పగించేందుకు తీసుకెళ్లారు.