ఖరీఫ్ కు అన్ని ఏర్పాట్లు చేయండి

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ఠ్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన చెప్పారు. ఖమ్మంలోని టిటిడిసి కార్యాలయంలో జిల్లా అధికారులతో మంత్రి సమీక్ష జరిపారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ ప్రారంభం నాటికి రైతులకు ఎరువులు అందుబాటులో ఉండాలని తుమ్మల అధికారులను ఆదేశించారు. మిషన్ కాకతీయ రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు.

సమీక్ష సమావేశంలో ఖమ్మం ఎంపి పోంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు.