క్రైస్తవులపై ముష్కర దాడి, 25 మంది మృతి

ఈజిప్ట్‌లోని మిన్యా ప్రావిన్స్‌లో ఓ బస్సుపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. రెండు బస్సుల్లో కాప్టిక్ క్రిస్టియన్లు సెయింట్ సామ్యూల్ మోనెస్టరీకి వెళ్తుండగా ముసుగులు ధరించిన 10 మంది ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 24 మంది మృతి చెందగా.. మరో 25 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ కాల్పులకు సంబంధించి ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తూ ఎలాంటి ప్రకటన చేయలేదు. కాల్పులకు పాల్పడిన దుండగుల కోసం భద్రతా దళాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.