కోమటి చెరువుని సందర్శించిన మంత్రి హరీశ్

సిద్దిపేటలోని కోమటి చెరువుని మంత్రి హరీశ్ రావు సందర్శించారు. చెరువు అభివృద్ధి పనులను పరిశీలించి.. త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అక్కడ వాకింగ్ చేస్తున్న స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తానను నేరుగా కలవవచ్చిన స్థానికులకు మంత్రి సూచించారు. ఆయన వెంట కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, శాసనమండలి విప్ సుధాకర్ రెడ్డి ఉన్నారు.