కేపీఎస్ గిల్ కన్నుమూత

పంజాబ్ మాజీ డీజీపీ కేపీఎస్ గిల్ (82) గుండెపోటుతో కన్నుమూశారు. ఉదయం ఛాతినొప్పి రావడంతో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. కొద్ది కాలంగా ఆయన ముత్రపిండాల వ్యాధితో, గుండెకు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. పంజాబ్‌లో ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో గిల్ అణచివేశారు. 1989లో భారత ప్రభుత్వం కేపీఎస్ గిల్‌ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 1958 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన గిల్ 1995లో ఉద్యోగం నుంచి పదవి విరమణ చేశారు. అనంతరం ఇండియన్ హాకీ ఫెడరేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు.