కులవృత్తులను కాపాడేందుకు కృషి

కులవృత్తులను కాపాడేందుకు సీఎం కేసీఆర్‌ అనేక కార్యక్రమాలను చేపడుతున్నారని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గొంగడి సునీత చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని వంగపల్లిలో గొర్రెల పంపిణీకి లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామసభ నిర్వహించారు. లాటరీ పద్దతిలో 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. గతంలో ఏ ప్రభుత్వం గొల్ల, కురుమల గురించి ఆలోచించలేదని, సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా వీరి అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారని సునీత చెప్పారు. ఈ సందర్భంగా ఆమెకు గొల్ల, కురుమలు గొంగడి కప్పి గొర్రె పిల్లను బహుకరించారు.