కిడ్నాపర్ల నుంచి మరిదిని కాపాడిన షూటర్!

ప్రాణాలకు తెగించి మరీ కిడ్నాపర్ల నుంచి తన మరిదిని రక్షించింది షూటర్ అయిషా ఫలక్‌.  ఢిల్లీకి చెందిన మహ్మద్‌ ఆసిఫ్‌ కాలేజీ నుంచి వస్తుండగా అతన్ని కిడ్నాప్‌ చేశారు. సమాచారం తెలుసుకున్న అయిషా.. అడిగినంత డబ్బు ఇస్తామంటూ కిడ్నాపర్లను నమ్మించింది. వారు చెప్పిన ప్రదేశానికి వెళ్లి.. ఆసిఫ్ ను వదిలిపెట్టాలని కోరింది. ఐతే, డబ్బు ఇస్తేనే అతన్ని వదిలిపెడ్తామని కిడ్నాపర్లు చెప్పడంతో లైసెన్స్‌డ్ గన్‌ తీసి వారి కాళ్లపై కాల్పులు జరిపింది. ఊహించని పరిణామంతో షాక్‌ తిన్న ఆ కిడ్నాపర్లు ఆ బాలుణ్ని వదిలిపెట్టి పారిపోయే ప్రయత్నం చేశారు. ఇంతలో పోలీసులు వచ్చి వారిని అరెస్టు చేయడంతో కథ సుఖాంతమయ్యింది.