కాళేశ్వరం 11వ ప్యాకేజీలో మార్పులు

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం 11వ ప్యాకేజీ పనుల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. 1.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించ తలపెట్టిన ఇమామ్‌బాద్ జలాశయాన్ని ఈ ప్యాకేజీ నుంచి తొలగించారు. అనంతగిరి నుంచి రంగనాయక సాగర్‌కు నీరు తరలించే పనులకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. రోజుకు నీరు తరలించే సామర్థ్యం 241 నుంచి 343 క్యూసెక్కులకు పెంచింది. పనుల్లో మార్పుల నేపథ్యంలో రూ.3433.78 కోట్ల అంచనా విలువను సవరించారు. ప్రస్తుత కాంట్రాక్టర్‌కే పనులు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.