ఓయూ డిగ్రీ ఫలితాలు విడుదల

ఓయూ డిగ్రీ ఫలితాలు విడుదలయ్యాయి. ఓయూ డిగ్రీ సెకండియర్, థర్డ్ ఇయర్ ఫలితాలను ఓయూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌లోని కమిటీ రూంలో వీసీ రామచంద్రం విడుదల చేశారు. ఓయూ డిగ్రీ ఫలితాల్లో మొత్తం 57.23 శాతం ఉత్తీర్ణత సాధించారు. బీఏ గ్రూప్‌లో 63.97 శాతం, బీకాం గ్రూప్‌లో 56.20 శాతం, బీఎస్‌సీ గ్రూప్‌లో 53.14 శాతం ఉత్తీర్ణత సాధించారు. బీబీఏలో మొత్తం 90.13 శాతం ఉత్తీర్ణత సాధించగా..బాలురు 47.21 శాతం, బాలికలు 65.92 శాతం ఉత్తీర్ణత సాధించారు.