ఐటీ, డాటా, గేమింగ్ కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్ భేటి

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ శాంటాక్లారాలో పర్యటిస్తున్నారు. ఐటీ, డాటా, గేమింగ్ కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. తెలంగాణ ఐటీ, పారిశ్రామిక విధానాలను మంత్రి వారికి చెప్పారు. భారత్‌లో ఏ నగరానికి లేని ప్రత్యేకతలు హైదరాబాద్‌కు ఉన్నాయని కేటీఆర్ ఆయా కంపెనీల ప్రతినిధులకు తెలిపారు. ఐటీ పరిశ్రమకు తెలంగాణ ఇస్తున్న రాయితీలను వివరించారు. హైదరాబాద్‌లో సిగ్నేచర్ టవర్ ఏర్పాటుకు స్థలం ఇవ్వాలని ఐటీ సర్వ్ ప్రతినిధులు మంత్రికి వినతిపత్రం ఇచ్చారు.