ఉగ్రదాడులు ఆగేవరకు పాక్ తో మ్యాచ్ లు ఉండవు

పాకిస్థాన్ నుంచి ఉగ్రదాడులు ఆగే వరకు ఆ దేశజట్టుతో ద్వైపాక్షిక క్రికెట్ మాట ఎత్తేది లేద‌న్నారు కేంద్ర క్రీడల శాఖ మంత్రి విజ‌య్ గోయెల్. పాకిస్థాన్ క్రికెట్‌ బోర్డుకు బీసీసీఐ ఏదైనా హామీ ఇచ్చే ముందు కేంద్రప్ర‌భుత్వంతో మాట్లాడాల‌న్నారు. దుబాయ్‌లో బీసీసీఐ, పీసీబీ మీటింగ్‌ నేపథ్యంలో విజయ్‌ గోయల్‌ ఈ విధంగా స్పందించారు. కాగా, పాక్‌ తో క్రికెట్ సంబంధాల‌ను తామేమీ వ్య‌తిరేకించ‌డం లేద‌ని, ప్ర‌భుత్వం అనుమ‌తి కోస‌మే చూస్తున్నట్లు బోర్డు సెక్ర‌ట‌రీ అమితాబ్ చౌద‌రి చెప్పారు.