ఈ సారైనా సక్సెస్ అయ్యేనా?

ఐశ్వర్యారాయ్ పోలికలతో టాలీవుడ్ లోకి దూసుకువచ్చిన స్నేహా ఉల్లాల్.. ఒక్కసారిగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయింది. కానీ, అంతలోనే డల్ అయిన అమ్మడి కెరీర్… చివరకూ అర్ధాంతరంగా ముగిసిపోయింది. చివరిగా ‘యాక్షన్ 3D’లో కనిపించిన స్నేహా… ఆ తరువాత ఎక్కడా కనిపించకుండా పోయింది. ఆఫర్లు లేకపోవడంతో… చివరకు మెంటర్ సల్మాన్ ఖాన్ పుణ్యమాని బాలీవుడ్ లో ‘బేజుబాన్ ఇష్క్’ అనే మూవీ చేసింది. కానీ, అది అట్టర్ ఫ్లాప్ గా మిగిలిపోయింది. అయితే ఇన్నాళ్లూ అవకాశాలు లేకపోవడం వల్లే అమ్మడు ఫేడ్ అవుట్ అయిపోయిందని అనుకుంటోన్న జనాలకు స్నేహ కొత్త కథ చెబుతోంది. ఇన్ని రోజుల గ్యాప్ రావడానికి తన అనారోగ్యమే అంటోంది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనే జబ్బుతో పోరాడి… పూర్తి ఆరోగ్యంగా తయారైన కారణంగా… ఇప్పుడు మళ్లీ సినిమాలపై దృష్టిపెడుతోందట. ఈ సారైనా అమ్మడిని ఆదుకునే దర్శకుడు దొరుకుతాడేమో చూడాలి.