ఆవిర్భావ వేడుకలపై మంత్రి జూపల్లి సమీక్ష

నాగర్‌కర్నూల్ జిల్లాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొల్లాపూర్ లోని కెఎల్ఐ గెస్ట్ హౌస్ లో అధికారులు, ప్రజా ప్రతినిధులతో మంత్రి జూపల్లి కృష్ణారావు ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. మినీ స్టేడియంలో సాంస్కృతిక, ఆటలపోటీలు, ముగ్గుల పోటీలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.