తిరుగులేని సన్ రైజర్స్

ఐపీఎల్‌  డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సన్‌  రైజర్స్‌  హైదరాబాద్‌.. 10వ సీజన్‌ లో  నాలుగో  విజయాన్ని దక్కించుకుంది.  హోం గ్రౌండ్‌ లో  ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌ లో  15 పరుగుల  తేడాతో  అద్భుత  విజయాన్ని  సొంతం చేసుకుంది. చివరి ఓవర్‌  వరకు ఉత్కంఠగా  సాగిన మ్యాచ్‌ ను సొంతం చేసుకున్న సన్‌ రైజర్స్‌  పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.

టాస్‌ గెలిచి ఫస్ట్‌ బ్యాటింగ్‌  చేపట్టిన  హైదరాబాద్‌.. 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. రెండో ఓవర్‌ లోనే వార్నర్‌ అవుటైనా.. శిఖర్‌ ధావన్‌,  విలియమ్సన్‌ లు దాటిగా ఆడి.. జట్టుకు భారీ స్కోర్‌ అందించారు.  ధావన్‌  50 బాల్స్‌ లో 70 రన్స్‌  చేయగా.. విలియమ్సన్‌  51 బాల్స్‌ లో  5 సిక్సులు, 6 ఫోర్లతో  89 రన్స్‌  చేయడంతో.. 191  పరుగుల భారీ స్కోర్‌  నమోదైంది.  ఢిల్లీ బౌలర్లలో  అందరూ  విఫలమైనా.. మోరీస్‌ నాలుగు వికెట్లతో  సత్తా  చాటాడు.

192 పరుగుల లక్ష్యంతో  బరిలోకి  దిగిన ఢిల్లీకి ఓపెనర్లు బిల్లింగ్స్‌, శాంసన్‌  ఫ్లయింగ్‌ స్టార్ట్  ఇచ్చారు. మూడు ఫోర్లు కొట్టి ఊపుమీదున్న  బిల్లింగ్స్‌ ను  హైదరాబాదీ సిరాజ్‌ అవుట్‌  చేయడంతో ఢిల్లీ తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశలో బరిలోకి  దిగిన కరుణ్‌, శాంసన్‌ తో కలిసి బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఇద్దరూ  9 ఓవర్లలోనే  జట్టు స్కోర్‌ ను 85 పరుగులు  దాటించారు. ఈ దశలో యువరాజ్‌ వేసిన ఓవర్‌ లో కరుణ్‌ రనౌట్‌ కావడం.. వెంటనే రిషబ్‌ పంత్ అవుట్ కావడంతో  ఢిల్లీ కష్టాల్లో  పడింది. ఆ వెంటనే దాటిగా  ఆడుతున్న  శాంసన్‌..  సిరాజ్‌  బౌలింగ్‌ లో  పెవిలియన్‌ చేరడంతో.. ఢిల్లీ కథ ముగిసనట్టే కనిపించింది. కానీ శ్రేయాస్‌ అయ్యర్‌, మాథ్యూస్‌ లు చివరి ఓవర్‌ వరకు పోరాడి ఢిల్లీని గెలపించినట్టే కనిపించారు. కానీ చివరి ఓవర్‌ లలో భువీ, సిద్ధార్థ్‌ కౌల్‌ లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో.. హైదరాబాద్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. రైజర్స్‌ బౌలర్లలో సిరాజ్‌  రెండు వికెట్లు తీయగా.. 89 రన్స్‌ తో  సత్తా చాటిన విలియమ్సన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికైండు.