హైదరాబాద్ లోనే స్థిరపడాలని ఉంది

అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి హైద‌రాబాద్‌లో స్థిర‌ప‌డాల‌ని అనుకుంటోంది. అలా చేయాలంటే ముందుగా ఇక్క‌డ ఓ ఇల్లు కొనుక్కోవాల‌ని ప్లాన్ చేస్తోందిట‌. మంచి ఇల్లు, మంచి అవ‌కాశాలు! అన్న ప్రాతిప‌దిక‌న ఓ ఖ‌రీదైన ఇల్లు కొనుక్కునేందుకు ఎంతో ఉత్సాహం చూపిస్తోంది ఈ అమ్మ‌డు.అందుకు త‌గ్గ‌ట్టే లావ‌ణ్య ఆర్జ‌న కూడా ఉంది. ప్ర‌స్తుతం తెలుగులో ఈ అమ్మ‌డు క్రేజీ హీరోయిన్‌. ఇప్ప‌టికే నాగ చైతన్య సరసన ఒక సినిమాలో నటిస్తోంది. శ‌ర్వానంద్‌తో రాధ‌లోనూ నాయిక‌గా న‌టిస్తోంది. త‌దుప‌రి క్రేజీ ఆఫ‌ర్లు క్యూలో ఉన్నాయి. మ‌రోవైపు త‌మిళంలో గ్లామ‌ర్ పాత్ర‌లు చేసేందుకు ప‌చ్చ‌జెండా ఊపేసింది. ఇక ఖ‌రీదైన ఇల్లు కొనుక్కోవ‌డం పెద్దంత క‌ష్ట‌మేం కాదు. ఈ ఏడాదే గృహ ప్ర‌వేశం చేస్తుంద‌ని అంటున్నారు.