స్వల్పంగా పెరిగిన పెట్రో ధరలు

పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. లీటరు పెట్రోల్‌ పై రూ.1.39, డీజిల్‌ పై రూ.1.04 పెంచుతున్నట్లు ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలు ప్రకటించాయి.  కొత్త రేట్లు అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చాయి. ఇంధనంపై రాష్ట్ర ప్రభుత్వాలు విధించే స్థానిక పన్నులను సైతం పరిగణనలోకి తీసుకుంటే రిటైల్ బంకుల్లో రేట్ల పెరుగుదల ఇంతకంటే అధికంగా ఉండనుంది. అంతర్జాతీయ మార్కెట్లో పెట్రో ధరలు మళ్లీ పుంజుకోవడంతో దేశీయంగానూ రేట్లు పెంచాల్సి వచ్చిందని దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ ఇంధన సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్  వెల్లడించింది.