సీఎం కేసీఆర్‌ కారణజన్ముడు

సీఎం కేసీఆర్‌ కారణజన్ముడన్నారు టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు. టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో ఆయన తొలిపలుకులు పలికారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కేసీఆర్‌ కృషి చేస్తున్నారన్నారు. ఎంబీసీల అభివృద్ధికి కార్పోరేషన్‌ ఏర్పాటు చేసి వెయ్యి కోట్లు కేటాయించడం గొప్ప విషయం అన్నారు కేకే.