సాగునీటి పారుదల-వ్యవసాయ రంగంలో నూతన అధ్యాయం తీర్మానం

టీఆర్ఎస్ 16వ ప్లీనరీలో రెండో తీర్మానాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి ప్రవేశపెట్టారు. సాగునీటి పారుదల-వ్యవసాయ రంగంలో నూతన అధ్యాయం తీర్మానాన్ని ఆయన ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బలపరిచారు. ప్లీనరీకి హాజరైన ప్రతినిధులంతా ఈ తీర్మానాన్ని ఆమోదించారు.