సహారా ఆస్తులను వేలం వేయండి

సహారా చీఫ్ సుబ్రతో రాయ్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇన్వెస్టర్లకు డబ్బులు వాపసు ఇవ్వడంలో విఫలం కావడంతో… సహారా ఆస్తులను వేలం వేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 5 వేల కోట్ల బాకీలను వసూలు చేయడం కోసం పుణెలోని ఆంబే వ్యాలీ టౌన్ షిప్ ను వేలం వేయాలని ఆదేశించింది. సుబ్రతో రాయ్ పై కూడా సుప్రీంకోర్టు మండిపడింది. డబ్బులు చెల్లించకుంటే జైలుకు వెళ్లేందుకు సిద్ధమవ్వాలని స్పష్టం చేసింది. ఈ నెల 28న సుబ్రతో వ్యక్తిగతంగా హాజరుకావాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.