మెడ‌లో బూట్లు వేసుకున్న ట్యూబ్ లైట్…

కండల వీరుడు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం కబీర్‌ఖాన్ దర్శకత్వంలో ట్యూబ్ లైట్ మూవీలో న‌టిస్తున్నాడు.. నిన్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ అంటూ ఓ పోస్టర్ విడుదల చేశారు మూవీ మేకర్స్. ఇందులో సల్మాన్ ఖాన్ ని బ్యాక్ లుక్ లో మాత్రమే చూపించిన చిత్ర యూనిట్, తాజాగా మరో పోస్టర్ విడుదల చేసిదంది. ఇందులో సల్మాన్ తన రెండు షూస్ ని లేస్ తో కట్టుకొని మెడలో వేసుకున్నాడు. ఈద్ కానుకగా ఈ మూవీ విడుద‌ల కానుంది. ఈ మూవీలో చైనీస్ హీరోయిన్ జూ జూ సల్మాన్‌కు జోడీగా నటిస్తుంది.