మార్కెట్లోకి జియోమి ఎంఐ 6

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ జియోమి ప్రతిష్టాత్మక మైన ఎంఐ 6 స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. బీజింగ్‌లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం లో సంస్థ ఈ మోడల్‌ను రెండు వేరియం ట్లలో విడుదల చేసింది. 5.15 అంగుళాల తెర, స్నాప్‌ డ్రాగన్‌ 835 ప్రాసెసర్‌తో పాటు 6జీబీ ర్యామ్‌తో ఈ ఫోన్‌ లభిస్తుందని కంపెనీ తెలియజేసింది. వీటిలో 64 జీబీ స్టోరేజీ సామర్థ్యం కలిగి వేరియంట్‌ ధర రూ. 24,000  128 జీబీ సామర్థ్యపు ఫోన్‌ ధరను రూ.27,200  గా నిర్ణయించింది. 12 ఎంపీ రెండు వెనుక కెమేరాలు, 8 ఎంపీ ముందు కెమేరా, ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌, మెటాల్‌ బాడీ, నాలుగు వైపుల కర్వుడ్‌ గ్లాస్‌ డిజైన్‌, 1 నిట్‌ అల్ట్రా డార్క్‌ నైట్‌ డిస్‌ప్లే, 7.1.1 నోగట్‌ సిస్టమ్‌, 2.2 డ్యుయల్‌ వైఫై టెక్నాలజీ వంటి అదనపు పత్యేకతలు దీని సొంతర. 3350 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంతో ఇది లభిస్తుందని తెలిపింది.