ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతల కుట్ర

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు సీఎం కేసీఆర్. వారి కుట్రలను ప్రజలే తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా కోటి ఎకరాలకు సాగునీరు అందించి తీరుతామని స్పష్టంచేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం…. వలస బతుకులు ఆగిపోవడానికి భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కరెంటు కోతలు లేకుండా చేయగలిగామని సగర్వంగా ప్రకటించారు. పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ పురోగతిని మెచ్చుకుంటూ ఫిక్కీ మాజీ అధ్యక్షుడు లేఖ రాశారని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు.