ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు బంద్

పెట్రోల్ బంకులను ప్రతి ఆదివారం మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా 20 వేల బంకుల్లో వచ్చే నెల 14 నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర, హర్యానా, పుదుచ్చెరి రాష్ట్రాలకు చెందిన ఎంపిక చేసిన బంకులను ఆదివారం నాడు మూసివేయనున్నారు. ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం గతంలో ప్రకటించింది. అయితే, దీనిపై వ్యతిరేకత రావడంతో ప్రయోగాత్మకంగా మొదట 20 వేల బంకులను ఆదివారం నాడు మూసివేయనున్నారు.