పెంచిన సిమెంట్ ధరలను ఉపసంహరించుకోవాలి

పెంచిన సిమెంట్ ధరలను ఉపసంహరించుకోవాలని క్రెడాయ్, ట్రెడా, బాయ్, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్, తెలంగాణ డెవలపర్స్ అసోషియేషన్ డిమాండ్ చేశాయి. జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడిన ఈ సంఘాలు హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్ లో సమావేశమయ్యాయి. సిమెంట్ ఉత్పత్తిదారులు సిమెంట్ ధరలను 60 శాతానికి పైగా పెంచడాన్ని తప్పు పట్టాయి.

ఈ సమావేశంలో తెలంగాణ క్రెడాయ్ ప్రెసిడెంట్, జేఏసీ కన్వీనర్ జి. రామ్ రెడ్డి, హైదరాబాద్ క్రెడాయ్ జనరల్ సెక్రటరీ పి. రామకృష్ణ రావు, ట్రెడా అధ్యక్షులు, కో కన్వీనర్ పి. రవీందర్, తెలంగాణ బిల్డర్స్ ప్రెసిడెంట్ సి. ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.