పళనికి పన్నీర్ వర్గం డిమాండ్లు

అన్నాడీఎంకేలోని రెండు వర్గాల మధ్య చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. కాసేపటి క్రితం భేటీ అయిన పన్నీర్ సెల్వం వర్గం ప్రధానంగా రెండు డిమాండ్లను పళనిసామి వర్గం ముందుంచింది. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ప్రకటించుకున్న శశికళను, ఆమె మేనల్లుడు, పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా ఆమె నియమించిన దినకరన్ ను శాశ్వతంగా పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. జయలలిత మరణంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాల్సిందేనని తేల్చిచెప్పారు. పళనిసామి వర్గం తీరుపై కూడా అనుమానం వ్యక్తం చేశారు ఓపీఎస్ టీంకు చెందిన మునుస్వామి. పార్టీ గుర్తు, శశికళ ఎన్నికపై ఈసీకి ఇచ్చిన లేఖను కూడా ఉపసంహరించుకోవాలని కోరారు. తమ డిమాండ్లకు సరేనంటేనే విలీనంపై ముందుకు వెళ్దామని సంకేతాలిచ్చారు.