నవీన్ తో మమత భేటి

బీజేపీని కట్టడి చేసే సత్తా ప్రాంతీయ పార్టీలకు ఉందన్నారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఆ పార్టీ వల్ల ప్రాంతీయ పార్టీలకు ఎలాంటి నష్టం లేదన్నారు. ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ తో భువనేశ్వర్ లో సమావేశమైన మమత…. పలు అంశాలపై చర్చించారు.

వీవీఐపీలు వాహనాలపై ఎర్ర బుగ్గలు ఉపయోగించకుండా కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై మమత తనదైన శైలిలో స్పందించారు. తాను ఎప్పుడూ కారుపై రెడ్ బల్బ్ వినియోగించలేదని, అందుకే ఈ నిర్ణయం తనకు కొత్తేమీ కాదన్నారు. ఇటీవలే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు భువనేశ్వర్ నిర్వహించిన నేపథ్యంలో… నవీన్ తో మమత భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

అటు బీహార్ సీఎం నితీష్ కుమార్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాను ఢిల్లీలో కలిశారు. తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని నితీష్ చెప్పారు. అయితే, విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్ధి ఎంపికపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.