టీఆర్ఎస్ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ ఏకగ్రీవం

టీఆర్ఎస్ అధ్యక్షునిగా సీఎం కేసీఆర్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నాయిని నర్సింహారెడ్డి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. పార్టీ శ్రేణుల అభిమతం మేరకు సీఎం కేసీఆర్ ను మరోసారి అధ్యక్షునిగా ఎన్నుకున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ను పార్టీ అధ్యక్షునిగా ప్రకటించిన వెంటనే తెలంగాణ భవన్ లో సంబురాలు మిన్నంటాయి. పటాకులు కాలుస్తూ, స్వీట్లు పంచుకుంటూ పార్టీ నేతలు తమ సంతోషాన్ని పంచుకున్నారు.