జెట్ ఎయిర్ వేస్ విమానానికి తప్పిన ముప్పు

ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్‌లో జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానానికి పెను ముప్పు తప్పంది. ల్యాండింగ్‌ సమయంలో స్టీరింగ్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో.. ముందు టైర్‌ అడ్డం తిరిగింది. అయితే పైలట్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో విమానాన్ని సురక్షితంగా కిందకు దింపాడు. డెహ్రాడూన్‌ నుంచి ఢిల్లీకి వచ్చిన  ఈ విమానంలో ఉన్న 60 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది సురక్షితంగా ఉన్నారు.