గుండు చేయించుకున్నా.. 10 లక్షలు ఇవ్వండి!

బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ గుండు చేయించుకున్నారు. అజాన్ పై ఆయన చేసిన కామెంట్లపై అభ్యంతరం వ్యక్తం చేసిన మౌలావీ అనే ముస్లిం మత పెద్ద, సోనూకు గుండు చేసిన వారికి పది లక్షలు ఇస్తానంటూ ఫత్వా జారీ చేశారు. దీంతో స్పందించిన సోనూ నిగమ్…. తాను ముస్లింలకు వ్యతిరేకం కాదని వివరణ ఇచ్చారు. అంతటితో ఆగకుండా స్వచ్ఛందంగా గుండు చేయించుకున్నారు. తనకు గుండు చేసిన అలీం హకీం అనే వ్యక్తికి ఆ పది లక్షలు ఇవ్వాలని కోరారు. వాటిని ఏదైనా చారిటీకి ఇస్తానని చెప్పారు సోనూ నిగమ్.