ఐపీఎల్‌ 10లో రెండో సెంచరీ

ఐపీఎల్‌ దస్‌ లో రెండో సెంచరీ నమోదైంది. ముంబై ఇండియన్స్‌ పై పంజాబ్‌ కింగ్స్‌ ఓపెనర్‌ హషీమ్ ఆమ్లా శతకం బాదాడు. ముంబై ఇండియన్స్‌ బౌలర్లపై వీరవిహారం చేస్తూ సిక్సుల మోత మోగించాడు. 58 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌ లతో 104 పరుగులు చేసి  అజేయంగా నిలిచాడు. ఆమ్లా సూపర్‌ సెంచరీతో పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 198 రన్స్‌ చేసింది. ముంబై ఇండియన్స్‌ ముందు 199 టార్గెట్‌ ఉంచింది.