ఎట్టకేలకు దిగొచ్చిన కట్టప్ప

కట్టప్ప ఎట్టకేలకు దిగివచ్చాడు. కన్నడ ప్రజలకు క్షమాపణలు చెప్పాడు నటుడు సత్యరాజ్. కావేరీ వివాదంలో తాను చేసిన వాఖ్యలు కన్నడ ప్రజలను బాధపెట్టి ఉంటే క్షమించాలని కోరారు. తాను కర్నాటకకు గానీ, అక్కడి ప్రజలకు గానీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. తొమ్మిదేళ్ల క్రితం ఉన్న పరిస్థితుల్లో కొంత అవేశంగా మాట్లాడిన సంగతి నిజమేనని, అయితే కన్నడిగులను బాధపెట్టాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. బాహుబలి-2 సినిమా విడుదలను అడ్డుకోవద్దని అక్కడి ప్రజలను కోరారు.