ఊపందుకున్న టీఆర్ఎస్ నేతల కూలీ పనులు

నెల 27 వరంగల్లో జరగనున్న భారీ  బహిరంగ సభ నిధుల సమీకరణ కోసం..  రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు కూలీ పనిచేస్తున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు జోరుగా కూలి పనులు చేస్తూ..  నిధులు సమీకరిస్తున్నారు. ఇందులో భాగంగా హో మంత్రి నాయిని నర్సింహారెడ్డి హైదరాబాద్ గోషామహల్ నియోజక వర్గంలో కూలీ పని చేశారు. నియోజక వర్గంలోని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి పలు దుకాణాల్లో బస్తాలు మోసారు. దీని ద్వారా సుమారు 7 లక్షల వరకు సంపాదించారు.

నిజామాబాద్లోని పలు  దుకాణాల్లో ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కూలి పని చేశారు. మెడికల్షాపులో పనిచేసి కూలిడబ్బులు అందుకున్నారు. ఆయనతోపాటు మేయర్ ఆకుల సుజాత,పలువురు టీఆర్ఎస్ నేతలు ఉన్నారు. నిజామాబాద్ రూరల్ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కార్ల షోరూంలో పనిచేశారు. కార్లు తుడవడంతోపాటు మెకానిక్గా పనిచేసి…. లక్ష రూపాయలు సంపాదించారు. కామారెడ్డి జిల్లా పిట్లం మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే హన్మంత్ షిండే కూలిపని చేసి రెండు లక్షలు సంపాదించారు. అటు  మేడ్చెల్ జిల్లా పీర్జాదిగూడలో ఎమ్మెల్యే  సుధీర్ రెడ్డి హమాలీ పనిచేశారు. టిఫిన్ సెంటర్, పెట్రోల్ బంక్, ఆస్పత్రిలలో పనిచేసి 4 లక్షలు సంపాదించారు. ఇటు కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్‌ గంప గోవర్థన్‌ హోటల్‌లో కూలీ పని చేశారు. బిర్యానీ పార్సిల్‌ చేసి కస్టమర్లకు అందించి డబ్బు సంపాదించారు.

 

కరీంనగర్ జిల్లా మానకొండూర్లో మంత్రి ఈటెల కూలిపనిచేశారు. రైస్ మిల్లులో పనిచేసి కూలీ డబ్బులు అందుకున్నారు. ఆ తర్వాత పెద్దపల్లి జిల్లాలోని రైస్‌ మిల్లులో బియ్యం తూకం వేసి విరాళాలు సేకరించారు మంత్రి ఈటెల. కరీంనగర్ జిల్లా గోపాల్ పూర్ గ్రామంలోని కూరగాయల తోటలో లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూలీ పని చేశారు. విరగకాసిన బీరకాయలను కోసి ….10 వేల రూపాయల కూలీ సంపాదించారు. చొప్పదండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొడిగె శోభ కూలిపనిచేశారు. గ్రానైట్ ఫ్యాక్టరీలో కూలిపనిచేసి కూలీడబ్బులు అందుకున్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు కూలీ పని చేశారు. పట్టణంలోని కిరాణ షాపుల్లో కూలీ పని చేసి 2 లక్షల రూపాయలు సంపాదించారు. ఇటు  మంచిర్యాల జిల్లా కేంద్రంలోని  శాలివాహన పవర్ ప్లాంటు, హనుమాన్ రైస్ మిల్లులో స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు కూలి పని చేసి లక్షా 50 వేలు సంపాదించారు. ఎండ్‌ వాయిస్‌-గులాబీ కూలీ దినాల్లో భాగంగా ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని నాలుగు జిన్నింగ్ మిల్లులో బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు కూలీపని చేశారు.

 

వరంగల్లో ఎంపీ పసునూరి దయాకర్ పెట్రోల్ బంకుతోపాటు పలు దుకాణాల్లో పని చేశారు. కళాశాలలో విద్యార్థులకు పాఠాలు బోధించి 80 వేలు సంపాదించారుఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ కొండా మురళి దంపతులు వరంగల్ లో వ్యవసాయ కూలీ పని చేసి 51 వేల రూపాయలు సంపాదించారు. అటు వరంగల్ అర్బన్ జిల్లా వడ్డెపల్లిలో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ కూలి పనులు చేశారు. శుభానందిని సెంట్రల్ జోన్ ఆఫీస్ లో పని చేసి లక్ష రూపాయలు సంపాదించారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి  గొర్రెకుంట ఇండస్ట్రియల్ ఎరియాలో  కూలి పనిచేశారు. కొల్డ్ స్టొరేజ్‌,కాటన్ జిన్నింగ్ మిల్లులలో హమాలీ పనిచేసి రెండు లక్షల 56 వేల రూపాయలు సంపాదించారు. అటు జనగామ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూలిపనిచేశారు. పాఠాశాలలో పాఠాలు బోధించడంతోపాటు ఇటుకలు మోసి 85 వేలు సంపాదించారు.

జడ్చర్లలో మంత్రి లక్ష్మారెడ్డి ఐస్క్రీం షాప్లో పనిచేశారు. ఐస్క్రీంలు అమ్మి పదివేలు సంపాదించారు. మహబూబ్ నగర్ లోని ఎస్వీఎస్ మెడికల్ కాలేజీలో ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ స్వీపర్లుగా పని చేసి 5 లక్షల రూపాయలు సంపాదించారు. అనంతరం స్థానిక సింధు హోటల్లో సర్వర్లుగా పనిచేసి 1 లక్షా 16 వేల రూపాయల కూలీ అందుకున్నారు. అటు వనపర్తి జిల్లాలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్ రెడ్డి కూలి పని చేశారు. హోటళ్లో టీ అమ్మడంతోపాటు మార్కెట్ యార్డులో బస్తాలు మోశారు. పలు దుకాణాల్లో పనిచేసి రెండు లక్షలు సంపాదించారు.

జోగులాంబ జిల్లా ఆలంపూర్‌ నియోజకవర్గంలోలో మాజీ ఎంపీ మందా జగన్నాధం కూలీ పనిచేశారు. వాహనదారులకు పెట్రోల్‌ పోసారు. ఆ తర్వాత హోటల్‌లో ఛాయ్‌ అమ్మారు. దీని ద్వారా 5 వేల రూపాయలను సంపాదించారు.ఇటు గద్వాల్ లోని రైస్‌ మిల్లులో ఎంపీపీ సుభాన్ హమాలీ పనిచేసాడు. అయన తో పాటు కార్యకర్తలు కూడా కూలీ పని చేసి 25 వేలు  సంపాదించారు.

నాగార్జున్ సాగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ సీనియర్ నేత నోముల నర్సింహయ్య కూలిపనిచేశారు . గోడౌన్లో బస్తాలు మోశారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ కూలిపనులు చేశారు. బట్టలషాపులో సేల్స్మెన్గా పనిచేసి ,మూటలు మోసి 54  వేలు సంపాదించారు. ఆ తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లా  మోత్కూరు మండల కేంద్రంలోని ఓ బట్టల షాపులో పని చేసి 11వేలు విరాళాలు సేకరించారు ఎమ్మెల్యే గాదరి కిషోర్‌. నకిరేకల్మండలం ఆర్లగడ్డగూడెంలో ఎమ్మెల్యే వేముల వీరేశం కూలిపనిచేశారు. పొలంలో వరిపంటను కోసి కూలీడబ్బులు అందుకున్నారు. ఇటు నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ కూలీ పనిచేశారు బస్తాలు మోసి 3లక్షల 50వేలు సంపాదించారు.  ఇటు నల్గొండ జడ్పీ చైర్మన్‌ బాలు నాయక్‌ కూలీ పనుల్లో పాల్గొన్నారు. ఆయిల్, కాటన్ మిల్లులతో పాటు ఐస్‌ క్రీమ్‌ షాపుల్లో పనిచేసి 7 లక్షల వరకు సంపాదించారు. ఇటు యాదాద్రి జిల్లా వంగపల్లిలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షులు రేపాక స్వామి , సింగిల్‌ విండో డైరెక్టర్లు కల్నేపల్లి శ్రీశైలం కూలీ పనిచేశారు.  వ్యవసాయ పొలంలో వడ్ల బస్తాలు మోసి 5వేలు విరాళాలు సేకరించారు. ఖమ్మంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూలిపని చేశారు. రిక్షా తొక్కడంతో పాటు పలు దుకాణాల్లో పనిచేసి కూలీ డబ్బులు అందుకున్నారు.

వైరా ఎమ్మెల్యే మదన్ లాల్పలు దుకాణాల్లో పనిచేసి, బస్తాలు మోసి కూలి డబ్బులు  అందుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య కూలిపనిచేశారు. కూరగాయల మార్కెట్‌,చికెన్ సెంటర్తోపాటు పలు దుకాణాల్లో పనిచేశారు.సంగారెడ్డి జిల్లా బి హెచ్ ల్ చౌరాస్తాలో ఎమ్మెల్యే  మహిపాల్‌ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డిలు పెట్రోల్ బంక్‌లో పనిచేశారు. వాహన దారులకు పెట్రోల్ పోసి డబ్బులు సంపాదించారు. ఆ తర్వాత హోటల్ లో సర్వేర్ గా కూలీ పనిచేసి వరంగల్ లో జరిగే టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభకు దారి ఖర్చుల కోసం విరాళాలు సేకరించారు. టీఆర్‌ఎస్‌ ప్లీనరీతో పాటు వరంగల్‌ లో జరిగే ఆవిర్భావ సభకు రవాణా ఖర్చుల కోసం రంగారెడ్డి జిల్లా షాద్‌ నగర్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ కూలీ పని చేశారు. పిట్టి ల్యామినేషన్ కంపెనీలో తట్టలు మోసి లక్ష రూపాయలు విరాళాలు సేకరించారు.