ఆరుగురు సజీవ దహనం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పరిధిలోకి వచ్చే ఢిల్లీ శివారులోని నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఎలక్ర్టానిక్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో ఆరుగురు సజీవ దహనమయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. నాలుగంతస్థుల ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో… చాలామంది సిబ్బంది అందులో చిక్కుకున్నారు. ఫైర్ సిబ్బంది పలువురిని రక్షించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.