అన్నాడీఎంకే వర్గాల విలీనానికి కమిటీ

అన్నాడీఎంకే కు చెందిన ఇరు వర్గాల విలీనంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. నిన్నటి దాకా సైలెంట్ గా ఉన్న పళనిసామి వర్గం… విలీనంపై ముందడుగు వేసింది. ఎంపీ వైద్యనాథలింగం నేతృత్వంలో పన్నీర్ సెల్వం వర్గంతో చర్చలు జరిపేందుకు ఏడుగురు సభ్యులతో కమిటీ వేశారు సీఎం పళని సామి. ఈ కమిటీలో మంత్రులు జయకుమార్, శ్రీనివాసన్, సెంగొట్టయ్యన్ లు కూడా సభ్యులుగా ఉన్నారు. పన్నీర్ వర్గం ఎప్పుడు చర్చలకు పిలిచినా వెళ్లేందుకు సిద్ధమని పళని వర్గం చెప్పింది. దీంతో త్వరలోనే ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరే అవకాశం.