అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న ఆర్సీబీ

ఓ వైపు వరుస పరాజయాలు.. స్టార్‌  ప్లేయర్స్‌  ఉన్నా  కలిసిరాని అదృష్టం.. మరో వైపు పలువురు ఆటగాళ్ల  ఫామ్‌ లేని.. అన్నీ అవంతరాలను దాటుకుంటూ..  ఐపీఎల్‌ 10లో  బెంగళూర్‌ రాయల్‌ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. రాజ్‌ కోట్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌ లో  గుజరాత్‌ లయన్స్‌ పై 21 పరుగుల తేడాతో కోహ్లీ సేన గ్రాండ్‌ విక్టరీ కొట్టంది. 

టాస్‌ ఓడి ముందు బ్యాటింగ్‌ చేపట్టిన బెంగళూర్‌.. 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.  ఫామ్‌ కోల్పోయి.. గత మ్యాచ్‌ లో తుది జట్టులో చోటు కోల్పోయిన క్రిస్‌ గేల్‌.. గుజరాత్‌ పై సత్తా చాటాడు. కేవలం 38 బాల్స్‌ లో 7 సిక్సులు, 5 ఫోర్లతో 77 రన్స్‌ తో అదరగొట్టాడు. అటు కోహ్లీ కూడా 50 బాల్స్‌ లో 64 రన్స్‌ చేయడంతో.. బెంగళూర్‌ స్కోర్‌ బోర్ట్‌ జెట్‌ వేగంతో దూసుకుపోయింది. గేల్‌, కోహ్లీలు వెంట వెంటనే అవుటైనా.. చివర్లో ట్రావిస్‌ హెడ్‌ 30, కేదార్‌ జాదవ్‌ 38 రన్స్‌ తో రెచ్చిపోవడంతో.. 213 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. అటు లయన్స్‌ బౌలర్లలో తాంపి, కులకర్ణిలకు చెరో వికెట్‌ లభించింది.

214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ కు.. ప్రారంభంలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. స్మిత్‌ తో పాటు దాటిగా ఆడిన రైనా వెంట వెంటనే అవుటయ్యారు. దాంతో మెకల్లమ్‌, ఫించ్‌ తో కలిసి దాటిగా ఆడాడు. ఒక వైపు వికెట్లు పడుతున్నా.. మరో ఎండ్‌ లో మెకల్లమ్‌ ఒంటరి పోరాటం చేశాడు. 44 బంతుల్లో 72 పరుగులు చేసిన మెకల్లమ్‌ అవుట్‌ కావడంతో.. గుజరాత్‌ ఆశలు సన్నగిల్లయ్యాయి. చివర్లో ఇషాన్‌ కిషన్‌ 39, జడేజా 23 రన్స్‌ తో రాణించినా.. బాల్స్‌ తక్కువ ఉండడంతో గుజరాత్‌ విజయానికి 21 పరుగులు దూరంలోనే నిలిచిపోయింది. గుజరాత్‌ బౌలర్లలో చాహల్‌ మూడు వికెట్లతో రాణించాడు.