అక్టోబర్ లో సమంత చైతుల పెళ్లి..?

సమంత- నాగచైతన్య నిశ్చితార్థం ముగిసిన తర్వాత మ్యారేజ్‌పై వీళ్లిద్దరు ఎలాంటి స్టేట్‌మెంట్ చేయలేదు.. ఎవరి ప్రాజెక్టుల్లో వాళ్లు బిజీగా గడిపేస్తున్నారు.  తాజాగా అందుతున్న సమాచారం మేరకు  అక్టోబర్‌లో వీళ్ల పెళ్లి జరిగే ఛాన్స్ వున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరు రెండేసి ప్రాజెక్టులు చేస్తున్నారు. అక్టోబర్ నాటికి ఆయా ఫిల్మ్స్ చిత్రీకరణలు పూర్తి కానున్నాయి. కొన్నిరోజులు షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి ఆ సమయంలో మ్యారేజ్ చేసుకుంటే ఎలాంటి సమస్య వుండదని ఆలోచిస్తున్నట్లు టాలీవుడ్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వివాహం మాత్రం హైదరాబాద్‌లో హిందూ, క్రైస్తవ సంప్రదాయాల్లో నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.