24న స్పీడ్ స్టర్ ఎంపికలు

2020, 2024 ఒలింపిక్స్‌ పరుగు పందెంలో పతకమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా వేట మొదలు పెట్టింది. గేల్‌ ఇండియా స్పాన్షర్‌  షిప్‌ లో ఇండియన్  స్పీడ్‌ స్టర్‌  పేరుతో బృహత్తర కార్యక్రమాన్ని రూపొందించింది.  ఇండియన్  స్పీడ్‌ స్టర్‌ కోసం దేశ వ్యాప్తంగా మెరికల్లాంటి కుర్రాళ్లను ఎంపిక చేస్తోంది. రాష్ట్రంలో మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు ఈ నెల 24న ఎల్బీ నగర్‌ లో సెలక్షన్స్  నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఇండియన్  స్పీడ్  స్టర్‌  పోస్టర్‌ ను టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం నాయకులు ఆవిష్కరించారు.