హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి అజార్ నామినేషన్

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌  హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌  ఎన్నికల బరిలోకి దిగాడు. అధ్యక్ష పదవికి ఆయన ఇవాళ నామినేషన్‌ దాఖలు చేశారు. హెచ్‌సీఏ అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. క్రికెట్‌ లో హైదరాబాద్‌ ప్రాభవం తగ్గిపోతోందని.. దానిని తిరిగి తెస్తానని హామీ ఇచ్చారు. హెచ్ సీఏ హైదరాబాద్ కే పరిమితం అయ్యిందని విమర్శించారు.  గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి క్రికెట్‌ పట్ల యువకుల్లో ఆసక్తి పెంచుతానన్నారు అజారుద్దీన్‌. కాగా హెచ్‌సీఎలో ఓటు హక్కు లేని అజారుద్దీన్‌ నామినేషన్‌ వేయడంపై ప్రత్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఐతే, లోథా కమిటీ సిఫార్సుల ప్రకారం హెచ్ సీఏ అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి సభ్యత్వం అవసరం లేదని అజార్ స్పష్టం చేశారు.