సీఈవోకు యాపిల్ ఝలక్!

టెక్‌  దిగ్గజం యాపిల్‌  తన టాప్‌ ఎగ్జిక్యూటివ్‌  కు ఝలక్‌  ఇచ్చింది. రెవెన్యూలు, లాభాలు, లక్ష్యాలు సాధించడంలో విఫలం కావడంతో ఆయనకు ఇచ్చే ఇన్సెంటివ్‌  లను తగ్గించింది. సెక్యూరిటీ అండ్‌ ఎక్స్ఛేంజ్‌  కమిషన్‌  కు సమర్పించిన నివేదికలో టిమ్‌ కుక్‌  2016లో కాంపన్సేషన్‌  8.75 మిలియన్‌ డాలర్లుగా చూపారు. అంతకు ముందు ఏడాది కన్నా ఆయన జీతం మిలియన్‌  డాలర్లు పెరిగినప్పటికీ, ఇన్సెంటివ్స్ మాత్రం చాలా తగ్గిపోయాయని చెప్పారు. గతేడాది కంపెనీ వార్షిక విక్రయాలు దాదాపు 4శాతం తగ్గడంతో 223.6 బిలియన్‌ డాలర్లుగా పెట్టుకున్న లక్ష్యాన్ని కంపెనీ అందుకోలేకపోయింది. ఆ ప్రభావం కాస్తా కంపెనీ సీఈఓపై పడింది.