ముగిసిన నేషనల్ ఫారెస్ట్ స్పోర్ట్స్ మీట్

క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఆల్ ఇండియా ఫారెస్ట్ స్పోర్ట్స్ మీట్ ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే నెంబర్ వన్ సీఎం అని మహమూద్ అలీ చెప్పారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లోనూ దూసుకుపోతోందన్నారు. హరితహారంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కల పెంపకాన్ని చేపట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అనిల్ దవే  పాల్గొన్నారు.