మా పార్టీలో చీలికలు లేవు!

సమాజ్ వాది పార్టీలో ఎలాంటి చీలికలు లేవని ఆ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌ మరోసారి స్పష్టం చేశారు. లక్నోలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సోదరుడు శివపాల్‌ యాదవ్‌ తో కలిసి ఆయన మాట్లాడారు. పార్టీలో అందరూ ఐక్యంగానే ఉన్నారని చెప్పారు. ఐతే, ఒక్క వ్యక్తి కారణంగానే ఈ సమస్య వచ్చిందని ములాయం చెప్పారు. పరోక్షంగా మరో సోదరుడు రాంగోపాల్‌ యాదవ్‌ ని ఉద్దేశించి ఈ కామెంట్ చేశారు. పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందవద్దని ములాయం సూచించారు.