మార్చి 16న భద్రాద్రి పవర్ ప్లాంట్ పనులు ప్రారంభం

వచ్చే మార్చి 16న భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని మొండికుంట గ్రామంలో నిర్మించిన సబ్‌ స్టేషన్‌ ను ఆయన ప్రారంభించారు. ఆంధ్ర పెట్టుబడిదారులు చేసిన కుట్రల వల్లనే పవర్‌ ప్లాంట్‌ పనులు ఆలస్యం అయ్యాయని మంత్రి జగదీశ్‌ రెడ్డి చెప్పారు.

ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు, జడ్పీ చైర్‌ పర్సన్‌ కవిత, స్థానిక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.