మళ్లీ పుంజుకున్న పసిడి ధర

పసిడి ధర మళ్లీ పెరిగింది. నోట్ల రద్దు తర్వాత కొంతకాలం పాటు నేల చూపులు చూసిన బంగారం ధరం ఆ తర్వాత క్రమంగా పుంజుకుంది.  తాజాగా  పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.330 పెరిగి రూ.29,030కి చేరుకుంది. ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడం వల్లే పసిడి ధర పెరిగినట్టు బులియన్ వర్గాలు వెల్లడించాయి. గతేడాది డిసెంబరు 5న రూ.29,050 ఉన్న బంగారం ధర నెల రోజుల మళ్లీ ఆ స్థాయికి చేరుకుంది. వెండి ధర కూడా కిలోకు రూ.350 పెరిగి రూ.40,750కు చేరుకుంది.