భారత్‌తో సంబంధాల్లో మార్పుండదు!  

యూఎస్‌ ప్రెసిడెంట్‌, భారత ప్రధాని నేరుగా మాట్లాడుకునేందుకు 2015లో ఏర్పాటైన హాట్‌లైన్‌ కొత్త అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హయాంలోనూ కొనసాగుతుందని  వైట్‌ హౌస్‌ సెక్రటరీ ప్రకటించారు. ఒబామా పదవీ కాలంలో కొత్తగా ఏర్పాటైన హాట్‌లైన్‌ ఇదొక్కటే కావడం విశేషం. 2015లో రిపబ్లిక్‌ డే వేడుకలకు ఒబామా అతిథిగా వచ్చారు. ఆ సమయంలో భారత ప్రధానితో హాట్‌లైన్‌ ఏర్పాటు చేయాలని ఒబామా నిర్ణయించారు. రష్యా, చైనా, బ్రిటన్‌, భారత్‌లకు మాత్రమే ఇప్పటి వరకు వైట్‌ హౌస్‌లో హాట్‌  లైన్‌ ఉంది. ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చాక ఒబామా, మోడీ ఓసారి గంటకుపైగా మాట్లాడుకున్నారు.