ప్రైవేటు బస్సుల ఆగడాలను అరికట్టాలి

ప్రైవేటు బస్సుల యాజమాన్యాల ఆగడాలను అరికట్టాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అధికారులను కోరారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు చార్జీలను రెట్టింపు చేసి ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నాయని బుధవారం సచివాలయంలోని మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ ఆరోపించారు. చార్జీల పెంపుపై రవాణాశాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టి ఆయా సంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీకి చెందిన ప్రైవేటు బస్సులు అధిక చార్జీలు వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు.