ప్రతి ఖాతాకు పాన్ కార్డ్ తప్పనిసరి!

బ్యాంకు అకౌంట్లకు పాన్ నెంబర్ ను తప్పనిసరి చేస్తూ కేంద్ర ఆర్ధిక శాఖ అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 28లోగా అన్ని బ్యాంకు అకౌంట్లకు పాన్ నెంబర్ ను లింక్ చేయాలని, ఖాతాదారులకు పాన్ కార్డ్ లేకపోతే వారి నుంచి ఫామ్ నెంబర్ 60ని తీసుకోవాలని స్పష్టం చేసింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత అకౌంట్లలో పెద్ద ఎత్తున డబ్బులు డిపాజిట్ అయ్యాయి. వాటిలో కొన్ని ఫేక్ అకౌంట్లున్నాయనే సమాచారంతో కేంద్రం పాన్ నెంబర్ ను జత చేయడం తప్పనిసరి చేసింది.