నేను ఢిల్లీ వదలను

ఆమ్‌  ఆద్మీ పార్టీ నుంచి పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తే ఉంటాడని అరవింద్  కేజ్రీవాల్  స్పష్టం చేశారు. ఢిల్లీని వదిలి పంజాబ్‌  సీఎం అభ్యర్థిగా కేజ్రీవాల్‌  ఉండే అవకాశం ఉందని వచ్చిన వార్తలపై ఆయన వివరణ ఇచ్చారు.  తాను ఢిల్లీని వదలనని చెప్పారు.  ఉప ముఖ్యమంత్రి మనీష్‌  సిసోడియా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. పంజాబ్‌  లో  ఈసారి తమ పార్టీ గెలవటం ఖాయమని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు.