ధూంధాంగా స్లేట్ స్కూల్ వార్షికోత్సవ వేడుక

పాఠశాల వార్షికోత్సవం అంటే ఆ కోలాహలమే వేరు.. గెస్టులు, ప్రసంగాలు, డ్యాన్సులు, నాటకాలు..  కాని స్లేట్ స్కూల్ విద్యార్థులు మాత్రం వీటన్నింటికీ భిన్నంగా చేశారు. అత్యద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ప్రపంచంలోని మహామహుల జీవిత చరిత్రలు. మహత్తర సంఘటనలు.. వాటి ప్రభావాలు… భారతీయ సంస్కృతి.. సామాజిక అంశాలపై చిన్నారులు చేసిన ప్రదర్శన అందరిని ఆలోచించేలా చేసింది.

లలితకళాతోరణం ప్రాంగణంలో జరిగిన స్లేట్ స్కూల్ వార్షికోత్సవం అత్యంత సందడిగా జరిగింది.  ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం మధ్య చిన్నారులు నృత్యరూపకాలు మైమరపించాయి. సుమారు 5గంటలపాటు ఏకధాటిగా చిన్నారులు ప్రదర్శించిన వైవిధ్య భరితమైన నృత్యరూపకములు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

జిస్‌ దేశ్‌మే గంగా బహతీ హై పేరుతో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకల్లో చిన్నారులు సత్తాచాటారు. వివిధ సామాజిక అంశాలపై చర్చిస్తూనే వాటికీ మళ్ళీ నృత్యరూపకంలో సమాధానం ఇస్తువచ్చారు చిన్నారులు. పుట్టినప్పటి నుండి చిన్నారుల చదువులు, చేయబోయే వృత్తుల పేరుతో తల్లీదండ్రులు వారిపై వేస్తున్న భారం, ఆ తర్వాత బట్టీ చదువుల తీరును కళ్లకు కట్టారు. బుద్ధుడు, గాంధీ, నేతాజీ, నెహ్రూ, అంబేద్కర్‌ వారిని స్మరించుకునే విధానాన్ని నృత్యరూపకంతో మైమరపింపచేశారు. రాజ్యపాలకులు, మతసామరస్యాన్ని వికసింపచేశారు.

ఓవరాల్ గా  రోటిన్ కు భిన్నంగా జరిగిన ఈ వార్షికోత్స వేడుకలు అందరిని ఆలోచింపచేశాయి.. బట్టీ చదువుల వల్ల ఎలాంటి పరిణామాలు తలెత్తుతున్నాయో విద్యార్థులు కళ్లకు కట్టినట్లు చూపించారు.