ద్రవ్యోల్బణం కట్టడికి చర్యలు

ద్రవ్యోల్బణం కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌  పటేల్‌.  ద్రవ్యోల్బణాన్ని 4శాతానికి తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. ఇందుకోసం ఆరుగురు సభ్యులతో కూడిన మానిటరీ పాలసీ కమిటీ ప్రణాళిక రూపొందిస్తోందని వెల్లడించారు. తమ బ్యాంకులు అంతర్జాతీయ మూలధనం నిబంధనలకు అనుగుణంగా పని చేస్తున్నాయని వివరించారు. గాంధీనగర్‌ లో జరుగుతున్న వైబ్రంట్ గుజరాత్‌   సమ్మిట్‌ లో పాల్గొన్న ఆయన.. పాలసీ మేకింగ్‌ పై మాట్లాడారు.